728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 6, 2020

క‌రోనాపై ఆందోళ‌న వద్దు: ఎమ్మెల్యే రజిని

నాదెండ్ల: అమీన్‌సాహెబ్‌పాలెంలో శ‌నివారం కొత్త‌గా క‌రోనా కేసు న‌మోద‌వ‌డంతో ఎమ్మెల్యే హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకుని ఆయా శాఖ‌ల అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క‌రోనా రోగుల‌కు ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటోంద‌న్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం అమ‌లుచేయ‌ని విధంగా ట్రూనాట్ మెషిన్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న ఘ‌న‌త ఏపీకే ద‌క్కుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం మ‌న రాష్ట్రంలో 257 ట్రూనాట్ మెషిన్ల ద్వారా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి టెలీమెడిసిన్ వ్య‌వ‌స్థ‌ను రూపొందించింది మ‌న రాష్ట్రంలోనేని తెలిపారు. ఏఎన్ఎంల ద్వారా అవ‌స‌ర‌మైన మందులు ఇంటికే పంపుతున్న‌ట్లు చెప్పారు.

హైద‌రాబాదులో కేసు న‌మోదు..

అమీన్‌సాహెబ్‌పాలెంలో కొత్త‌గా బాలింత‌కు క‌రోనా కేసు న‌మోద‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. హైద‌రాబాదు నుంచి ఆమె రెండు రోజుల కింద‌టే పుట్టినిల్లు అమీన్‌సాహెబ్ పాలేనికి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రాష్ట్ర స‌రిహ‌ద్దులో శాంపిల్ తీసి పంపార‌ని, ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని తేలింద‌ని తెలిపారు. ఆమెతోపాటు ప్రైమ‌రీ, సెకండ‌రీ కాంటాక్ట్‌లు మొత్తం 20 మందిని క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు చెప్పారు.ఆందోళ‌న అక్క‌ర‌లేద‌ని, ఎవ‌రికీ ఏమీ కాద‌ని, అంద‌రూ సుర‌క్షితంగా ఇళ్ల‌కు వ‌స్తార‌ని ఎమ్మెల్యే ధైర్యం నింపారు. గ్రామంలో చేప‌డుతున్న పారిశుద్ధ్య ప‌నుల‌ను ప‌రిశీలిచారు. ఏఎన్ఎంలు చేస్తున్న స‌ర్వేను ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు. పోలీసులు, రెవెన్యూ, వైద్య‌, మండ‌ల‌ప‌రిష‌త్ సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. కార్య‌క్ర‌మంలో త‌హ‌శీల్దార్ సాంబ‌శివ‌రావు, ఎంపీడీవో మోజేష్‌, ఎస్ ఐ నారాయ‌ణ‌రెడ్డి, వైద్యాధికారి కిర‌ణ్‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండ‌లాధ్య‌క్షుడు శ్రీనివాస‌రెడ్డి,ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: క‌రోనాపై ఆందోళ‌న వద్దు: ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE