728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 11, 2020

చిలకలూరిపేటలో కంటైన్మెంట్ జోన్లు కుదింపు ఎప్పుడు ⁉️

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు కంటైన్మెంట్ జోన్ లపై పూర్తి స్పష్టత ఇంకా రావడం లేదు.

♦️చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు అధికారులు మూడు కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా, శివాలయం వీధిలోని కొద్ది రోజుల క్రితం ఒక జోన్ ను తొలగించారు.

♦️చినపీరుసాహెబ్ వీధిలో రెండో కంటైన్మెంట్ జోన్ ఉండగా, మూడో కంటైన్మెంట్ జోన్ రజక వీధి ప్రాంత పరిధి ఉంది.

♦️అయితే  కోవిడ్-19 పాజిటివ్ ఆ వీధిలోని నమోదైన ఆఖరి వ్యక్తి  చికిత్స 14 రోజుల అనంతరం  కోలుకొని నెగిటివ్ వచ్చి ఇంటికి వచ్చిన 14 రోజుల తర్వాత కంటెంట్మెంట్ ఎత్తివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.
చినపీరుసాహెబ్ వీధి..
♦️విషయానికి వస్తే చినపీరుసాహెబ్ వీధిలో నలుగురు వ్యక్తులకు కోవిడ్-19  సోకగా, ఇద్దరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన కోలుకొని ఇంటికి వచ్చారు. అయితే 25వ తేదీన కరోనా సోకిన ఒక మహిళ 11 వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు ఇంటికి చేరుకున్నారు. గోరంట్లలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వారు పూర్తిగా కోలుకొని ఇంటికి రాలేదు.
రజకవీధి..
♦️పట్టణంలోని రజక వీధిలో గత నెల 27వ తేదీన కరోనా సోకిన వ్యక్తి  ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 8వ తేదీన డిశ్ఛార్జ్  అయ్యి ఇంటికి వచ్చింది.

♦️అయితే కంటైన్మెంట్ జోన్ను 200 మీటర్ల మేర అధికారులు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్ లో కోలుకున్న వ్యక్తి ఇంటికి వచ్చిన 14 రోజుల తర్వాత కంటైన్మెంట్ జోన్ ను కుదించే అవకాశం ఉంది.

ఈ జోన్ చుట్టూ వ్యాపార సముదాయాలే..
♦️రజక వీధి కంటైన్మెంట్ జోన్ వల్ల చుట్టుపక్కల వ్యాపార, వాణిజ్య, సముదాయాలు ఉండడం వల్ల జిల్లా అధికారులతో కంటైన్మెంట్ జోన్ కుదింపు విషయం చిలకలూరిపేట అధికారులు మాట్లాడే ఆలోచనలో ఉన్నారు.

♦️ఒకవేళ జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ కుదింపు విషయం ఒప్పుకోకపోతే ఈ నెల 22వ తేదీ వరకు రజక వీధిలో కంటైన్మెంట్ జోన్  ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కంటైన్మెంట్ జోన్లు కుదింపు ఎప్పుడు ⁉️ Rating: 5 Reviewed By: NEWS UPDATE