728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

చిలకలూరిపేటలో తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్...

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు జిల్లా అధికారులు గుంటూరులో ప్రకటించారు.

♦️పట్టణంలోని చినపీరుసాహెబ్ వీధిలో ఉన్న ఒక మహిళ ఈనెల 20 తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లగా ఆ మహిళ ఎదురు ఉన్న బెడ్ పై చందవరం గ్రామానికి చెందిన వృద్ధుడు డు 20 తేదీన మృతి చెందాడు.

♦️అయితే ఆ వీధి చెందిన మహిళ కు 25వ తేదీన పరీక్ష నిర్వహించగా ఆ పరీక్షలో పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్యులు వెల్లడించారు.

♦️ఇప్పటిదాకా ఆ మహిళకు  ఎక్కడనుంచి వైరస్ సోకిందనేది  అర్థం కాలేదు. అయితే వారి కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఈ మహిళ 20 తేదీన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్లు ఆస్పత్రిలోనే పాజిటివ్ సోకినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

♦️ఆ మహిళ కుమారుడు భర్త కూడా విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్  పరీక్షలు నిర్వహించగా అతని కుమారునికి పాజిటివ్ ఉన్నట్లు అధికారులు ఈ రోజు  వెల్లడించడంతో అతనిని ఇప్పుడు దాకా కెఎంసి లోని క్వరెంటైన్ సెంటర్ర్లో ఉంచగా అతనిని కూడా అధికారులు ఇప్పుడు ఐసోలాషన్కు తరలిస్తున్నారు.

♦️అయితే ఇంకొక విషయం ఏమంటే ఆ వీధిలో ఆ మహిళ ఇంటి పక్కన ఉన్న ఒకే కుటుంబంలో ఇద్దరికీ పాజిటివ్ రావడంతో వారి కాంటాక్ట్ ఎక్కడి నుంచి వచ్చేది పూర్తిగా తెలియట్లేదు.

♦️అతను ఒక ప్రైవేటు కంపెనీలో వాచ్మెన్ గా పని చేస్తూ వున్నాడు. ఈ మహిళ ద్వారా పాజిటివ్ సోకలేదని తెలుస్తుంది.

♦️చిలకలూరిపేట చినపీరుసాహెబ్ వీధిలో ఇప్పటికీ నలుగురు వ్యక్తులకు పాజిటివ్ సోకింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్... Rating: 5 Reviewed By: NEWS UPDATE