728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

అప్పుడే డబ్ల్యూహెచ్‌ఓపై ఆలోచిస్తాం: అమెరికా

వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థలో నెలకొన్న అవినీతికి ముగింపు పలికి, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గిస్తే దానిలో తిరిగి చేరే అంశాన్ని పరిశీలిస్తామని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా విషయంలో ఆరోగ్య సంస్థ, చైనా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, ప్రపంచ వ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపిస్తూ, ఆ సంస్థతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడింది.

‘డబ్ల్యూహెచ్‌ఓలో సంస్కరణలు అవసరం. అధ్యక్షుడు చెప్పినట్లు సంస్థలో సంస్కరణలు తీసుకువచ్చి అవినీతికి ముగింపు పలికితే, చైనా మీద ఆధాపడటాన్ని తగ్గిస్తే తిరిగి దానిలో చేరే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తాం’ అని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌ రాబర్ట్ ఓబ్రీన్ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు సంస్థ కోసం వెచ్చించిన నిధులను రెడ్ క్రాస్‌, తదితర ఆరోగ్య సంస్థల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అవసరం ఉన్నవారికి అందించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆఫ్రికాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కోసం ఇప్పటికే అమెరికా నిధులు వెచ్చిస్తోందని, పన్నులు చెల్లించి అమెరికా పౌరులే అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని తెలిపారు. అది తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా చేయట్లేదన్నారు. అక్కడి ఎయిడ్స్‌, హెచ్‌ఐవీ బాధితుల ప్రాణాలను ఆ సంస్థేమీ కాపాడటం లేదని విమర్శించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉన్న ఆ సంస్థ ద్వారా ఇకపై నిధులు వెళ్లవని హామీ ఇస్తున్నామని చెప్పారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అప్పుడే డబ్ల్యూహెచ్‌ఓపై ఆలోచిస్తాం: అమెరికా Rating: 5 Reviewed By: NEWS UPDATE