728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు..

న్యూఢిల్లీ:
★ ప్రజలకు షాక్ ఇస్తూ.. వంట గ్యాస్ ధరలను పెంచాయి గ్యాస్ కంపెనీలు.

★ ప్రస్తుతం సిలిండర్ ధర రూ.100కి పైగా పైకి కదిలింది. దీంతో గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడనుంది.

★ జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి.

★ సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే.. 14.2 కేజీల నాన్ సబ్సీడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.11.5 పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ.593కి చేరింది.

★ అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.110 పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1139కి ఎగసింది.

★ కాగా మే నెలలో వంట గ్యాస్ ధర రూ.744 నుంచి రూ.581.50కి తగ్గించారు. అందుకు కారణం అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు తగ్గడమే.

★ జూన్ వచ్చేసరికి అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగాయి.

★ అందువల్ల తామూ పెంచాల్సి వచ్చిందని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి.

★ కాగా ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వ స్కీమ్ లబ్ధిదారులకు వర్తించదని ఇండేన్ గ్యాస్ కంపెనీ తెలిపింది.

★ ఈ లబ్ధిదారులు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్‌లో భాగంగా జూన్ 30 వరకూ ఉచిత సిలిండర్ పొందే ఛాన్స్ ఉంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఒకటో తేదీ ఝలక్.. పెరిగిన గ్యాస్ ధరలు.. Rating: 5 Reviewed By: NEWS UPDATE