728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు

విశాఖపట్నం:
★ విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమను గ్రీన్‌ కేటగిరీలోకి (పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమగా) మార్చేందుకు వీలుగా సంస్థ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

★ అక్కడ స్టైరీన్‌ లేదా ప్రమాదకర రసాయనాలతో సంబంధం ఉన్న ఎలాంటి ఉత్పత్తులూ తయారు చేయకుండా వేరే ఏదైనా ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రయత్నాల్లో ఉన్నారు.

★ ఇలా చేస్తే తప్ప అక్కడ యూనిట్‌ను ప్రారంభించడం సాధ్యం కాదని ఆ శాఖ భావిస్తోంది.

★ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7వ తేదీన గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే.

★ గత ఏడాది డిసెంబరులో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ విభాగం జారీచేసిన సూచనలు పాటిస్తే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదని అధికారులు భావిస్తున్నారు.

★ దీనికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

★ దుర్ఘటనపై విచారణకు ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ కూడా ఫ్యాక్టరీస్‌ విభాగం నివేదికను కీలకంగా భావిస్తోంది.

డిసెంబరులోనే లోపాల గుర్తింపు..

★ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ విభాగం అధికారులు గత ఏడాది డిసెంబరులో ఎల్‌జీ పరిశ్రమను పరిశీలించారు.

★ స్టైరీన్‌ ట్యాంకు దగ్గర ఉన్న పైపులు కొన్ని దశాబ్దాల నాటివని, అవి పాడైపోయాయని గుర్తించి.. వాటిని తక్షణం మార్చాలని సూచించారు.

★ నివేదిక ఇచ్చిన నాలుగు నెలల తర్వాత కూడా పాత పైపులతోనే పరిశ్రమను నిర్వహిస్తున్నారు.

★ ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

★ నిజానికి తనిఖీలకు ముందే పరిశ్రమ భద్రతా విభాగం ఈ విషయాన్ని గమనించాలి.

★ దీన్నిబట్టి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

అక్కడ స్టైరీన్‌ లేని ఉత్పత్తులు..

★ ఆ ఉత్పత్తితో కష్టమేఎల్‌జీ పాలిమర్స్‌కు యథావిధిగా స్టైరీన్‌ ఉత్పత్తి కొనసాగించడానికి అనుమతులు ఇవ్వడం కష్టమనే అభిప్రాయాన్ని పరిశ్రమల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

★ పర్యావరణానికి హాని కలిగించని వేరే ఏవైనా ఉత్పత్తులు తయారుచేసేలా ఎల్‌జీ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

★ అప్పుడే అక్కడ పనిచేసే సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించినట్లు అవుతుందని పరిశ్రమల శాఖ భావిస్తోంది.

★ భారీ పెట్టుబడులతో కూడిన సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోకుండా తగిన చర్యలను పరిశ్రమల శాఖ చేపట్టింది.

మూలకారణం గుర్తింపులో విఫలం...

★ ఎల్‌జీ పాలిమర్స్‌ దుర్ఘటనకు సంబంధించిన మూలకారణాన్ని గుర్తించటంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఏర్పాటు చేసిన సంయుక్త పర్యవేక్షణ కమిటీ విఫలమైందని సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌ ఆక్షేపించింది.

★ వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చేలా దర్యాప్తు చేయలేదని విమర్శించింది.

★ ఈ దుర్ఘటనపై ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చి ఆ అంశాలనే నివేదికలో పొందుపరిచిందని విమర్శించింది.

★ తగిన దర్యాప్తు లేకుండా నిరర్థక నివేదికను రూపొందించిందని ఆరోపించింది.

★ ఈ మేరకు ఆ బృందం ప్రతినిధులు డాక్టర్‌ కె.బాబురావుతో పాటు మరికొంత మంది శాస్త్రవేత్తలు ఆ కమిటీ నివేదికను అధ్యయనం చేసి.. అందులోని లోపాలను పేర్కొంటూ ఆదివారం నివేదిక విడుదల చేశారు.

★ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకునే నివేదిక రూపొందించారని ఆరోపించారు.

★ కమిటీ సభ్యుల్లో కొందరు అసలు ప్లాంటును సందర్శించకుండానే నివేదికను ఆమోదించటం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం ప్రతినిధులు పేర్కొన్నారు.

ఎన్‌జీటీ కమిటీ నివేదికలో వారు గుర్తించిన లోపాలను తమ అధ్యయన నివేదికలో వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి..

★ స్టైరీన్‌ స్టోరేజీ కేంద్రాల ఆకృతి, నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అత్యుత్తమ ఆచరణలు ఉన్నాయి? అవి ఎల్‌జీ పాలిమర్స్‌లో అమలవుతున్నాయా? అనే అంశాల పోలిక నివేదికలో లేదు.

★ సమీప గ్రామానికి స్టైరీన్‌ ఆవిరి వేగంగా ఎలా వ్యాప్తి చెందిందో ప్రస్తావించలేదు.

★ స్టైరీన్‌ ట్యాంకు లోపల 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసేందుకు చేపట్టిన చర్యలకు సంబంధించిన డేటా గురించి ప్రస్తావించలేదు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ సంప్రదింపులు Rating: 5 Reviewed By: NEWS UPDATE