సికింద్రాబాద్: నేటి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ప్రారంభం కావడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో సందడిగా మారింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్‌కి చేరుకుంటున్నారు. స్టేషన్లో ప్రయాణికుల మధ్య దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు. ఆరోగ్య పరీక్షలు చేశాక సమస్యలు లేని వారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
ప్రయాణికుల్లో కరోనా అనుమానితుల కోసం ఒక్కో రైల్లో 3 పీపీఈ కిట్లను ఉంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ ఛార్జీలతోనే టికెట్లు ఇస్తుండగా, జూన్ 29వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ మొదలవుతుంది.సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలోని ఆహారశాలలు, ఇతర దుకాణాలు తెరుచుకోనున్నాయి. కానీ పార్సిల్ మాత్రమే తీసుకెళ్లాలి.