728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 1, 2020

పెళ్లికొస్తే పార్సిల్‌ విందే!

కొండపల్లి: సంప్రదాయాలపైనా కరోనా ప్రభావం చూపుతోంది. పెళ్లి విందు భోజనాలను పార్సిళ్లల్లో అందించేలా చేసింది. కృష్ణా జిల్లా కొండపల్లి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్‌ కాలేషా తన కుమార్తెను విజయవాడ యువకుడికి ఇచ్చి మార్చిలో వివాహం చేయాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ కారణంగా వేడుకను వాయిదా వేశారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగించడంతో నిబంధనలకు అనుగుణంగా వివాహం చేద్దామని భావించారు. ఈ విషయాన్ని వరుడి తరఫు పెద్దలకు తెలపడంతో వారూ అంగీకరించారు. 20 మంది ఆత్మీయులకే ఆహ్వానాలు పంపి, ఆదివారం కొండపల్లిలో వివాహాన్ని నిరాడంబరంగా జరిపించారు. భోజనాన్ని డబ్బాల్లో పార్సిళ్లు చేసి, బంధువులకు అందించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పెళ్లికొస్తే పార్సిల్‌ విందే! Rating: 5 Reviewed By: NEWS UPDATE