నాదెండ్లలో ఆనందోత్సాహాల నడుమ ఏరువాక పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే స్వయంగా అరకదున్ని దుక్కి తోలారు. ట్రాక్టర్ నడిపి కార్యర్తలను ఉత్సాహపరిచారు. గోమాతకు పూజలు చేశారు. తొలుత వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి ఏరువాక ప్రారంభించారు. వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మస్తానమ్మ, నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల వ్యవసాయశాఖ అధికారులు ఏఆర్ ప్రసాద్, సరిత, శ్రీలత, నాదెండ్ల మండల తహశీల్దార్ సాంబశివరావు, ఎంపీడీవో మోషే, ఆయా విభాగాల అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి కాట్రగడ్డ మస్తాన్‌రావు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే విడుదల రజిని