728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 19, 2020

గిరిజన ప్రగతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?: చంద్రబాబు నాయుడు

అమరావతి:
★ స్వతంత్ర భారతదేశంలో గిరిజనులెవ్వరూ వారి ప్రగతికి గల అవకాశాలను పోగొట్టుకోకూడదని, దోపిడీకి గురికాకూడదని నాటి రాజ్యాంగ పరిషత్ లో ఒకే ఒక గిరిజన ప్రతినిధి శ్రీ జైపాల్ సింగ్ ముండా పేర్కొన్నారు.

★ అటువంటి రాజ్యాంగ నిబద్దత ప్రకారం గిరిజనులకు ఎదిగే అవకాశాలను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత.

★ కానీ వైసీపీ ప్రభుత్వానికి అలాంటి నిబద్దత ఏదీ లేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వం వల్ల స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ 34 శాతం నుండి 24 శాతానికి తగ్గిపోయి, బీసీలు తమ రాజకీయ సాధికారతను కోల్పోవలసివచ్చింది. ఇక ఇప్పుడు గిరిజనుల వంతు.

★ గిరిజన ప్రాంతాలలోని టీచర్ ఉద్యోగాలన్నీ 100 శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలంటూ తెలుగుదేశం ప్రభుత్వం జనవరి 10, 2000 తేదీన జీవో నెం.3ని తెచ్చింది.

★ రెండు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఆ జీవో ఇప్పుడు అమలు కాకుండా పోయే పరిస్థితి వచ్చినా ప్రభుత్వంలో ఏ స్పందనా లేదు.

★ గిరిజన ప్రగతి పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?

★ ఇప్పటికైనా గిరిజనుల హక్కులను, అవకాశాలను కాపాడటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఏపీ సీఎంకి లేఖ రాసాను.

★ గిరిజనులకు సమాన అవకాశాలు దక్కేలా నిరంతరం పోరాడుతుంది తెలుగుదేశం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గిరిజన ప్రగతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా?: చంద్రబాబు నాయుడు Rating: 5 Reviewed By: NEWS UPDATE