728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 16, 2020

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇవే

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను తెలుగులో చదివారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలియజేశారు.

బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే:
♦️వ్యవసాయానికి రూ.11,891 కోట్లు.

♦️వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు.

♦️ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు.

♦️వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు.

♦️మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు.

♦️ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు.

♦️ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు.

♦️కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు.

♦️బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు.

♦️విద్యశాఖకు రూ.22,604 కోట్లు.

♦️వైద్య రంగానికి రూ.11,419 కోట్లు.

♦️ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు.

♦️వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు.

♦️పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు.

♦️పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు.

♦️బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు.

♦️డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు.

♦️రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు.

♦️కరోనాపై పోరులో ముందున్నాం.

♦️కరోనా సందర్భంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు.

♦️2018-19లో స్థూల ఉత్పత్తి 8శాతమే పెరిగింది.

♦️గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు సునామీలా మీద పడ్డాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇవే Rating: 5 Reviewed By: NEWS UPDATE