అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులకు అయిన ఖర్చును వైకాపా నేతల నుంచే రాబట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు చేస్తుందనేదానికి రంగుల ఉదంతమే నిదర్శనమన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కారం, అహంభావం, మూర్ఖత్వానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు ఆక్షేపించారు. తాము చేసిందే ఒప్పు అనేలా కోర్టుల్లో వాదనలు చేయడం, తప్పుడు జీవోలు ఇవ్వడం, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదని ఆయన దుయ్యబట్టారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం వంద తప్పులు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.
తీర్పు అమలు చేయలేదు కాబట్టే కోర్టు ధిక్కరణగా తీసుకుని సీఎస్, సెక్రటరీ, కమిషనర్ హాజరు కావాలని ఆదేశించిందని చంద్రబాబు అన్నారు. వైకాపా తప్పులకు ముగ్గురు ఉన్నతాధికారులు కోర్టులో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఇంత జరిగినా మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అందరిదీ ఒక దారైతే వైకాపాది మరోదారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రంగులపై డబ్బులు, అడ్వొకేట్లకు ఫీజులు వృథా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ రంగులు తొలగించాలంటే కొంత సొమ్ము ఖర్చు అవుతుందని.. ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు.