చిలకలూరిపేట: రాష్ట్రంలో వైయస్సార్ సిపి అధికారంలో వచ్చిన నాటి నుండి దళితులపై అరాచకాలు, దౌర్జన్యాలు, అవమానాలు నానాటికీ పెరిగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు తెలియజేశారు. ఇటీవల గోదావరి బోటు ప్రమాదం జరిగిన సమయంలో బాధితుల పక్షాన, ప్రశ్నించిన మాజీ పార్లమెంట్ సభ్యులు దళిత నేత హర్ష కుమార్ ను జైల్లో పెట్టడం జరిగింది అని తెలిపారు. అలాగే హోం శాఖ మంత్రి అధికారాలను విజయ్ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చలాయించడం ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు అడిగిన దళిత వర్గానికి చెందిన వైద్యుని సస్పెండ్ చేయడం, అర్ధనగ్నంగా ఊరేగించడం, అరెస్టు చేసి చివరకు పిచ్చివాడు అని ముద్ర వేయడం లాంటి సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ లో దళిత వర్గానికి చెందిన ఒక సీనియర్ ప్రొఫెసర్ “డాక్టర్ ప్రేమానందం” ను యూనివర్సిటీ రిజిస్టర్ కులపరంగా దూషించి, తన కార్యాలయం నుండి నెట్టి వేసిన సంఘటన యావత్తు రాష్ట్ర దళిత ప్రజలపై జరిగిందిగా మేం భావిస్తున్నామన్నారు.
June 3, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అవమానాలే: చిలకలూరిపేట నియోజకవర్గ దళిత సంఘాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

