728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 3, 2020

న్యాయ ప్రక్రియ పూర్తి.. ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌మాల్యా

న్యూఢిల్లీ:
★ పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు, ప్రముఖ లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధమైంది.

★ ఇప్పటికే అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో.. ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఇవాళ వెల్లడించాయి.

★ తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

★ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది.

★ ‘‘వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్‌కు తరలించవచ్చు’’ అని ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి మీడియాకు వెల్లడించారు.

★ అయితే ఏ తేదీన మాల్యా తరలింపు ఉంటుందన్న దానిపై మాత్రం ఆయన పెదవి విప్పలేదు.

★ ‘‘విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం..’’ అని ఆయన పేర్కొన్నారు.

★ కాగా విజయ్ మాల్యాను భారత్‌కు తరలించే విషయమై సీబీఐ, ఈడీ అధికారులు యూకేలో ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

★ తొలుత తామే కేసు నమోదు చేశాం కాబట్టి... మాల్యా భారత్‌కు రాగానే ముందు మేమే కస్టడీలోకి తీసుకుంటాం.. అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

★ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం భారత బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్ల రుణాలకు సంబంధించి విజయ్ మాల్యా మోసం, మనీ ల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: న్యాయ ప్రక్రియ పూర్తి.. ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌మాల్యా Rating: 5 Reviewed By: NEWS UPDATE