728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 28, 2020

ఏపీలో పెరగనున్న రేషన్ సరుకుల ధరలు..?

అమరావతి: రేషన్‌ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ఇకపై సరకుల్లో బియ్యం మాత్రమే కిలో రూపాయికి ఇస్తారు. మిగిలిన వాటి ధరలు భారీగానే పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై ఒకటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఇకపై రేషన్‌ షాపుల్లో కందిపప్పు కావాలంటే కిలోకు రూ.67 చెల్లించాలి. అలాగే కిలో పంచదారకు రూ.34 చెల్లించాల్సి ఉంటుంది. అంత్యోదయ కార్డు హోల్టర్లు తప్ప మిగిలిన లబ్ధిదారులంతా కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుంది.

గతంలో కందిపప్పు కిలో రూ.40, పంచదార అరకిలో రూ.10కు ఇచ్చేవారు. లాక్‌డౌన్‌ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు మార్చి 29 నుంచి మే 29 వరకు మూడు నెలల కాలంలో ఆరుసార్లు ఉచితంగానే బియ్యం, కందిపప్పు/శనగలు అందించింది. తాజాగా ప్రభుత్వం బియ్యం కార్డులు జారీచేసింది. జూలై ఒకటి నుంచి ఈ కార్డులపైనే రేషన్‌ అందజేయనున్నది. అయితే మూడు నెలలపాటు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేసిన ప్రభుత్వం తాజాగా లబ్ధిదారులపై అధికభారం మోపడం దారుణమన్న విమర్శలు మొదలయ్యాయి.

కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అటువంటప్పుడు కందిపప్పుపై ఒక్కసారి కిలో రూ.27లు, పంచదారపై రూ.14 పెంచడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన కందిపప్పు రూ.80 నుంచి రూ.90లకు దొరుకుతోంది. చౌకడిపోల్లో ఇచ్చే కందిపప్పు నాణ్యతపై విమర్శలున్నాయి. పైగా ప్రభుత్వం కందిపప్పు టోకుగా కొంటుంది. కావున మిల్లర్లు తక్కువ ధరకే అందిస్తారు.

అటువంటప్పుడు రేషన్‌ షాపులో రూ.67కు విక్రయించడం వల్ల కార్డుదారులపై భారం పడుతుందని గ్రామీణ ప్రాంతానికి చెందిన డీలరు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో దాదాపు 12 లక్షల కార్డులు ఉన్నాయి. తాజా ధరలతో లబ్ధిదారులపై కందిపప్పు రూపంలో రూ.3.24 కోట్ల రూపాయలు, పంచదార రూపంలో రూ.84 లక్షల భారం పడనుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో పెరగనున్న రేషన్ సరుకుల ధరలు..? Rating: 5 Reviewed By: NEWS UPDATE