728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 28, 2020

భారత్ లో గూగుల్ పే బ్యాన్..? ఎన్ పీసీఐ క్లారిటీ

న్యూఢిల్లీ:
★ భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది.

★ దీనిపై ఎన్‌పీసీఐ శుక్రవారం స్పందిస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

★ అంతకు క్రితం గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది.

★ గూగుల్‌ పే యాప్‌ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది.

★ తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది.

★ గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది.

★ గూగుల్‌ పే.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు.

★ కాగా, గూగుల్‌ పే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్‌ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

★ జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ పే లేదని ఆర్‌బీఐ పేర్కొంది.

★ అయితే గూగుల్‌ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్ లో గూగుల్ పే బ్యాన్..? ఎన్ పీసీఐ క్లారిటీ Rating: 5 Reviewed By: NEWS UPDATE