728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

చిలకలూరిపేట కంటైన్మెంట్ జోన్లలో.. ఇక్కడ ఆకలి కనిపించదు.. అక్కడ అవసరాలు తీరవు..

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలో రెండు కంట్మెంట్ జోన్లు ఉన్నాయి. ఒకటి చినపీరుసాహెబ్ వీధి కాగా, రెండవది రజక వీధి. ఈ రెండు ప్రాంతాల్లో 200 మీటర్ల మేర అధికారులు కంటైన్మెంట్ జోన్ ను  ఏర్పాటు చేశారు.
చినపీరుసాహెబ్ వీధి పరిస్థితి..
♦️ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే.. చినపీరుసాహెబ్ వీధిలో శారదా హైస్కూల్ రోడ్డు, చినపీరుసాహెబ్ వీధి బజార్ లో అధిక మంది కూలీనాలీ చేసుకుని జీవించే వారు. వారి పరిస్థితి దయనీయంగా ఉందని, వారు కూలినాలి చేసుకునే పరిస్థితి లేకపోవడం వలన తిండికి జరగడం ఇబ్బందిగా ఉందని వారు వాపోతున్నారు. అక్కడ అందుబాటులో వాలంటీర్లు ఉండి సేవ చేస్తున్నా వారికి నిత్య అవసరాలు తేప్పించుకునే స్తొమత లేదని కొంత మందికి వాపోతున్నారు.
రజక వీధి పరిస్థితి..
♦️ఇక రజక వీధి పరిస్థితి వస్తే  ఆ చుట్టుపక్కల చౌత్రా సెంటర్, రెడ్ల బజార్ లో ఉన్నవారి ఇళ్లకు వాలంటీర్లు సరిగ్గా రాక వారికి కావలసిన పాలు, నీరు, నిత్యావసరాలు తేప్పించుకోలేక అనేక అగచాట్లు పడుతున్నట్లు వారు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేస్తున్నారు.

♦️ఈ విషయంపై చిలకలూరిపేట నియోజకవర్గ నోడల్ అధికారి ఆర్డిఓ వెంకటేశ్వరరావుకు తెలియజేయగా వారు మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ఇంటి ఇంటికి వెళ్లి వారికి కావాల్సిన నిత్యావసరాలను వాలంటీర్ల ద్వారా ఏర్పాటు చేపిస్తామన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట కంటైన్మెంట్ జోన్లలో.. ఇక్కడ ఆకలి కనిపించదు.. అక్కడ అవసరాలు తీరవు.. Rating: 5 Reviewed By: NEWS UPDATE