728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

అజ్ఞాతంలోకి డాక్టర్‌ సుధాకర్‌

విశాఖపట్నం: వైద్యుడు సుధాకర్‌ ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి డిశ్ఛార్జి అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విశాఖపట్నంలోనే ఓ రహస్య ప్రదేశంలో మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్లు, తనకు మద్దతు పలికేందుకు వచ్చేవారినీ ఐదురోజుల దాకా రానివ్వకూడదని నిర్ణయించినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. సుధాకర్‌ను ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేర్పించిందెవరన్నది చర్చనీయాంశమైంది. ఆయనే స్వయంగా వచ్చారంటూ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధారాణి ప్రకటన విడుదల చేశారు. సుధాకర్‌ను పోలీసులు కేజీహెచ్‌కు తీసుకురాగా ఓపీలో చూశామని, ఆసుపత్రిలో హడావుడి సృష్టించడంతో మానసిక వైద్యశాలకు పంపామని, పోలీసులు వారి వాహనంలో తీసుకెళ్లారని కేజీహెచ్‌ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. కేజీహెచ్‌లో చేర్పించాక సుధాకర్‌ అక్కడి వైద్యుల ఆధీనంలో ఉన్నట్లేనని, వారి సిఫారసుల ప్రకారమే తాము మానసిక వైద్యశాలకు తీసుకెళ్లాం గానీ, సొంత నిర్ణయం తీసుకోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై సీబీఐ అధికారులు దృష్టి సారించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అజ్ఞాతంలోకి డాక్టర్‌ సుధాకర్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE