దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ తీవ్రత కలవరానికి గురిచేస్తోంది. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,585కు చేరాయి. మొత్తం 6,895 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,18,918 మంది కోలుకున్నారు. కరోనా కేసుల సంఖ్యలో శనివారం ఉదయానికి ఇటలీని వెనక్కి నెట్టిన భారత్.. తాజాగా స్పెయిన్‌ను కూడా దాటి ప్రపంచంలోనే అత్యధికంగా కేసులున్న దేశంగా నిలిచిందని జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. దేశంలోనే మొత్తం బాధితుల్లో సగం మంది నాలుగు మెట్రోనగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
June 7, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కరోనా కేసుల్లో ఐదో స్థానానికి భారత్!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

