728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

మళ్లీ తెరపై షారుఖ్ ఖాన్‌!

ముంబయి: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ వెండితెరపై చివరి సారిగా ‘జీరో’ అనే హిందీ చిత్రంలో కనిపించారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు జోడీగా మరుగుజ్జు పాత్రలో నటించిన ఈ చిత్రం తర్వాత షారుఖ్‌ ఏ ప్రాజెక్టులను ప్రకటించలేదు. కాగా, తమ అభిమాన హీరో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఓ తీపికబురు! ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌, మరో హీరో మాధవన్‌ నటిస్తున్న ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌’ అనే చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.

2018లో విడుదలైన జీరోలో మాధవన్‌ నాసా శాస్త్రవేత్తగా అతిధి పాత్ర పోషించారు. అందుకు ప్రత్యుపకారంగా రాకెట్రీలో మెరిసేందుకు షారుఖ్‌ అంగీకరించారట. కాగా, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత నంబి నారాయణన్‌ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దేశద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ మాజీ ఇస్రో శాస్త్రవేత్త, చివరకు ఏ నేరమూ చేయలేదని నిరూపణ అయింది. చిత్రంలో నారాయణన్‌ పాత్రను మాధవన్‌ పోషించనున్నారు. అంతే కాకుండా రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. నారాయణన్‌ను ఇంటర్వ్యూ చేసి ఆయన కథను ప్రపంచానికి వెల్లడించే విలేకరి పాత్రను షారుఖ్‌ పోషించనున్నట్టు సమాచారం. ఈ పాత్రకు షారుఖ్‌ మాత్రమే వంద శాతం న్యాయం చేయగలరని మాధవన్‌ అన్నారు.

ఇక మరో బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్రలో కూడా సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నారనే సంగతి తెలిసిందే. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే శాస్త్రవేత్తగా ఆయన ఈ ఫాంటసీ చిత్రంలో కనిపించనున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో... అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మళ్లీ తెరపై షారుఖ్ ఖాన్‌! Rating: 5 Reviewed By: NEWS UPDATE