728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2020

చిలకలూరిపేటలో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ నలుగురి కోవిడ్-19 ఫలితాలు

చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీలోని ఒక మహిళ చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో గతనెల చికిత్స పొందినప్పుడు చందవరం గ్రామానికి చెందిన వృద్ధుడు అదే వార్డులో చికిత్స పొందిన విషయం విదితమే.

♦️ఆ వార్డులో చికిత్స పొందిన  కొంతమందిలో సుగాలి కాలనీకు చెందిన మహిళ కూడా ఉండటంతో అమెకు కోద్ది రోజుల క్రితం కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.

♦️అయితే ఆ టెస్ట్ రిపోర్ట్  కొంతమేరకు పాజిటివ్గా రావటంతో చిలకలూరిపేట  నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆ రిపోర్టుల పై కొంత అనుమానాస్పదంగా ఉందని, మరలా వారికి  పరీక్షలు చేయటానికి జిల్లా వైద్యశాఖ అధికారులను కోరారు. డాక్టర్ గోపి నాయక్ విజ్ఞప్తి మేరకు జిల్లా అధికారులు మరలా పరీక్షలు చేయమని డాక్టర్ గోపి నాయక్ కు ఆదేశించారు. వారికి మరలా  గురువారం నాడు ఆ మహిళకు  ఆమె భర్త కూడా పరీక్షలు నిర్వహించారు.

♦️అలానే పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో గత కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి వచ్చిన ఒక యువకుడు, వచ్చేటప్పుడు అక్కడ కోవిడ్ టెస్ట్ చేయించుకొని నెగటివ్ రిపోర్టు రావటంతో జిల్లా అధికారుల పెర్మిషన్ తో చిలకలూరిపేటకు వచ్చారు.

♦️అయితే చుట్టుపక్కల వారు  ఆందోళనతో అధికారులకు ఆ విషయం చెప్పటంతో ఆ యువకునితో పాటు,అదే కుటుంబంలో ఇంకో వ్యక్తికి కలిపి ఇరువురికి గురువారం నాడు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

♦️ఈ రెండు కుటుంబాల్లోని నలుగురికి పరీక్షలు నిర్వహించినప్పటి నుండి కొంత అనుమానాస్పదంగా ఉండటంతో వీరిని అధికారులు హౌస్ క్వరెంటైన్ లో  ఉండవలసిందిగా ఆదేశించి ఉన్నారు.

ఆ నలుగురికి నెగటివ్ రిపోర్ట్..

♦️అయితే రెండు ప్రాంతాల్లో నలుగురికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించిగా వారికి నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు  విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఈ నలుగురికి నెగిటివ్ రిపోర్ట్లు రావడంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ నలుగురి కోవిడ్-19 ఫలితాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE