చిలకలూరిపేట: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపహసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు చిలకలూరిపేట భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆద్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్ ఆటోకి తాడు కట్టి లాగుతూ, AIYF జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సుభాని రిక్షా తొక్కుతూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ ఏరియా కార్యదర్శి cr మోహన్ మాట్లాడుతూ పెంచిన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగభైరు సుబ్బాయమ్మ, రామారావు, బాబురావు, రత్తయ్య, సీపీఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
June 20, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఐ నిరసన
Rating: 5
Reviewed By: NEWS UPDATE

