728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 23, 2020

బంగాళాఖాతంలో అల్పపీడనాల జాడలేదు... కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాల జోరు తగ్గింది

విశాఖపట్నం:
★ అయితే ఉత్తర ఒడిసాలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

★ ఉదయం నుంచి సాయంత్రం వరకు భావదేవర పల్లి (నాగాయలంక మండలం)లో 50, నాగాయలంకలో 40, పిడుగురాళ్ల, ఆలూరు, వెంకటగిరికోటలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

★ రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమ లో పిడుగులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

★ కాగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాతే మళ్లీ వర్షాలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

★ మరోవైపు మంగళ, బుధవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

★ 25న కోస్తాంధ్రలో ఓ మోస్తరు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బంగాళాఖాతంలో అల్పపీడనాల జాడలేదు... కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాల జోరు తగ్గింది Rating: 5 Reviewed By: NEWS UPDATE