చిలకలూరిపేట: పట్టణానిలో ఈ నెల నుంచి కొత్తగా మరో 222 మంది అర్హులకు పింఛన్లు మంజూరయ్యాయి. వీరికి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం కోసం ఏడాది వ్యవధిలో ఏకంగా రూ.40వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఒక్క చిలకలూరిపేట పట్టణంలోనే ఏడాది వ్యవధిలో ఇప్పటివరకు 3వేల వరకు కొత్త పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో సైతం పింఛన్ల మంజూరు, పంపిణీలో తమ ప్రభుత్వం కొత్త చరిత్రను లిఖిస్తోందన్నారు. పింఛన్ పొందాలంటే వయసు అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించి దేశంలోనే మిగిలిన సీఎంలందరికీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిక్సూచిగా నిలిచారని తెలిపారు. ఎన్నికలకు ముందుకు వెయ్యి రూపాయలు ఉన్న పింఛన్‌ను తాము అధికారంలోకి వచ్చాక రూ.2250 చేశామని, విడదతల వారీగా పెంచుకుంటూ త్వరలోనే పింఛన్ ను మూడు వేల రూపాయలు చేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు 400 కోట్లు ఖర్చయ్యేదని, ఇప్పుడు ఆ విలువ రూ.1500 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఎంత ఖర్చయినా సరే వెనుకాడే ప్రసక్తే లేదని, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవర్చుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. ఇంటింటికీ వాలంటీర్లే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరని తెలిపారు. పింఛన్ల మంజూరే కాదు.. పంపిణీలో సైతం సరికొత్త విధానాలను అనుసరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హాఖాన్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి. ఎం.నాగరాజు, పట్టణ మైనారిటీసెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,బొల్లెద్దు చిన్న,యం.వి.రత్నరెడ్డి,కొలిశెట్టి శ్రీనివాసరావు,అలెగ్జాండర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
June 23, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

