వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజిని జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ సీపీ నాయకులు రత్నా రెడ్డి, కే శ్రీనివాసరావు (గోల్డ్) ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి అడ్వాన్సు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ను ఎమ్మెల్యే చేత కట్ చేయించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
చిలకలూరిపేట పట్టణంలో కళామందిర్ సెంటర్ లో వైస్సార్సీపీ నాయకులు సాపా సైదా వలి,నరసరావుపేట సెంటర్ లో మల్లెల రాజేష్ నాయుడు, సాయి కార్తిక్ సిటీ సెంటర్ వద్ద కాసా రామ శీను మరియు అడ్డ రోడ్ సెంటర్, కె.బి రోడ్డు మరియు పట్టణంలోని ప్రతి వార్డులో వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గుంటూరులోని పెద్ద పెద్ద హోర్డింగుల పై వైఎస్ఆర్సిపి నాయకులు రాజేష్ నాయుడు ఎమ్మెల్యే విడదల రజినికు జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్న ఫ్లెక్సీలు గుంటూరు పట్టణంలో ఆకర్షణీయంగా నిలిచాయి.
