న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులపై ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం ఎంచుకున్నవారికి ఈ ఆరు నెలల కాలానికి ఔట్ స్టాండింగ్‌పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యం కన్నా ఆర్థిక పరిస్థితి ముఖ్యం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ మారటోరియం కాలంలో వడ్డీని మాఫీ చేస్తే బ్యాంకులు, అప్పులు ఇచ్చిన సంస్థలు రూ.2 లక్షల కోట్లు నష్టపోతారని ఆర్‌బీఐ సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. ‘ఈ అంశాన్ని విూడియాకు లీక్ చేసి సంచలనాత్మకం చేయాలని ఆర్‌బీఐ ప్రయత్నిస్తోందని సుప్రీంకోర్టు వెల్లడించింది. కేసు విచారణను ఈ నెల 12 కు వాయిదా వేసింది.
June 4, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఆర్బీఐ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

