728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

గోదావరి బోర్డు సమావేశంలో ఏపీ వాదనాలు వినిపించిన ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు

విజయవాడ:
🔹ఏపీ నుండి జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్ సీ నారాయణరెడ్డి హాజరు.

🔹గోదావరి జలాల్లో 967 టీఎంసీల వాటా ఉందన్న తెలంగాణ అధికారులు.

🔹తెలంగాణ వాదనను తోసిపుచ్చిన ఏపీ అధికారులు.

🔹మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన ఆధారంగా 967 టీఎంసీలు తమ వాటా అన్న తెలంగాణ.

🔹దానిపై తీవ్రంగా అభ్యంతరం తెలిపిన ఏపీ అధికారులు.

🔹బచావత్ ట్రిబ్యునల్ లో తెలంగాణకు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు ఎక్కడ చేసిందో చూపించాలని నిలదీసిన ఏపీ అధికారులు.

🔹బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం అన్న ఏపీ అధికారులు.

🔹ఎక్కడా తెలంగాణ కు నీటి కేటాయింపులు చేయలేదని స్పష్టం చేసిన ఏపీ అధికారులు.

🔹నీటి వినియోగం లెక్కలు తేల్చేందుకు టెలీమీటర్లు ఏర్పాటు చయాలని బోర్డు నిర్ణయం.

🔹కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని రెండు రాష్ట్రాలకు బోర్డు ఆదేశం.

🔹10వ తేదీలోగా డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డు ఆదేశం.

🔹డీపీఆర్ లు ఇచ్చేందుకు అంగీకరించిన ఇరు రాష్ట్రాలు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గోదావరి బోర్డు సమావేశంలో ఏపీ వాదనాలు వినిపించిన ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు Rating: 5 Reviewed By: NEWS UPDATE