728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

ఇసుకపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి:
🔹ఇసుకపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అధికారులు హాజరు.

🔹కరోనా వైరస్‌ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయన్న అధికారులు.

🔹ఇప్పుడిప్పుడే.. మళ్లీ రీచ్‌లు ప్రారంభమవుతున్నాయన్న అధికారులు.

🔹వారం, పదిరోజుల్లో రోజుకు 3 లక్షల టన్నులు ఉత్పత్తిని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న అధికారులు.

🔹డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టండి.

🔹బల్క్‌ ఆర్డర్లకు అనుమతులను జేసీకి అప్పగించండి
పోర్టల్‌ ఆన్‌ చేయగానే వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన పోగొట్టాలి.

🔹ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్‌ బుకింగ్‌ ఉంటే సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వండి.

🔹గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలి.

🔹డిపోలనుంచే ఇసుక సరఫరా చేయాలి, నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలన్న సీఎం.

🔹ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలి
బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలన్న సీఎం.

🔹చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్లద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలన్న సీఎం.

🔹కాకపోతే పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తామన్న అధికారులు.

🔹ఎడ్ల బళ్లద్వారా తీసుకెళ్లి వేరేచోట నిల్వచేసి అక్రమంగా తరలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామన్న అధికారులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇసుకపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష Rating: 5 Reviewed By: NEWS UPDATE