చిలకలూరిపేట: ప్రపంచపర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎమ్మెల్యే విడదల రజిని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం దెబ్బతినకుండా ఉండాలంటే ఇంధనం, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు. వాతావరణం కలుషితమైపోతుండటం వల్ల సహజవనరులు దెబ్బతింటున్నాయని తెలిపారు. స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోలేకపోతున్నాని తెలిపారు. దీనివల్ల మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకమైపోతోందన్నారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు శాతం పెరుగుతుందని తెలిపారు.
June 5, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ప్రపంచ పర్యావరణదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

