లండన్: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ లాక్‌డౌన్ కాలంలోనూ రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లక్షల పౌండ్లు ఆర్జించాడు. లాక్‌డౌన్‌లో ఇన్‌స్టా ద్వారా అత్యధిక మొత్తం ఆర్జించిన క్రీడాకారుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. టాప్-10లో ఉన్న ఏకైక క్రికెటర్ అతడే కావడం గమనార్హం.
మార్చి 12- మే 14 మధ్య ఇన్‌స్టా ద్వారా ఏయే క్రీడాకారుడు ఎంత ఆర్జించాడో ‘అటెయిన్’ అనే సంస్థ వివరాలు సేకరించింది. ఈ జాబితాలో 3,79,294 పౌండ్లతో విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో నిలిచాడు. ఒక్కో పోస్టుకు 126,431 పౌండ్లు ఆర్జించాడని తెలిసింది. పోర్చుగీస్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డ్ ఏకంగా 1.8 మిలియన్ పౌండ్లు సంపాదించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. అర్జెంటీనా, ఎఫ్‌సీ బార్సిలోనా స్టార్ లయోనల్ మెస్సీ 1.2 మిలియన్ పౌండ్లు, పీఎస్‌జీ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ 1.1 మిలియన్ పౌండ్లతో వరుసగా 2, 3వ స్థానాలు సాధించారు.
బాస్కెట్ బాల్ దిగ్గజం షాక్విల్ ఓనీల్ (583,628 పౌండ్లు), ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్ (405,359) టాప్-5లో ఉన్నారు. స్వీడన్ ఫుట్‌బాల్ స్టార్ గ్లాటన్ ఇబ్రహిమోవిచ్ (184,413), ఎన్‌బీఏ మాజీ స్టార్ డ్వేన్ వేడ్ (143,146), బ్రెజిల్ ఫుట్‌బాలర్ డేనీ అల్వెస్ (133,694), బాక్సర్ ఆంథోనీ జోషువా (121,500) టాప్-10లో నిలిచారు.