చిలకలూరిపేట:
🔸చిలకలూరిపేట పట్టణంలో కరోనా పై రోజురోజుకు దుష్ప్రచారాలు పెరిగిపోతున్నాయి. ఫలానా వీధిలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిందంట..అంటూ ఆ నోటా ఈ నోటా పట్టణం మొత్తం లేనిపోని ప్రచారాలు జరుగుతున్నాయి. చిలకలూరిపేటలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృతి చెందిందట అంటూ లేనిపోని దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు.
🔸చిలకలూరిపేట సుగాలి కాలనీకు చెందిన ఒక మహిళ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గత నెల వైద్యం పొందింది.
🔸అదే వార్డులో చందవరం గ్రామానికి చెందిన వృద్ధుడు వైద్య చికిత్స పొంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తెలియజేయడంతో అతను చికిత్స పొందిన సమయంలో ఉన్న వ్యక్తులకు అనుమానాస్పదంగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు.
🔸అదే కోవలో ఆ మహిళకు గురువారం వారి కుటుంబంలో వారికి కోవిడ్-19 పరీక్ష నిర్వహించి ఆమెను హౌస్ క్వారంటైన్ లో ఉంచారు.
🔸అలానే పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి బజార్ లో ఉన్న ఒక వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం చెన్నై నుండి వస్తూ అక్కడ పరీక్ష చేపించుకొని నెగిటివ్ రిపోర్ట్ రావడంతో, జిల్లా అధికారుల పర్మిషన్ తో చిలకలూరిపేట లోని అతని స్వగృహానికి చేరుకున్నాడు.
🔸అధికారులకు అనుమానం రావడంతో మరలా అతనిని కూడా గురువారం నాడు కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు.
🔸అనంతరం అతనిని కూడా హౌస్ క్వరెంటైన్ లో ఉండమని చెప్పారు.
🔸ఈ రెండు ప్రాంతాల్లో ఇలా జరిగితే... రెండు కుటుంబాలకు సంబంధించి పాజిటివ్ వచ్చిందని కొందరు పలు రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఇటువంటి ప్రచారాలు చేస్తే ఆపేడమిక్ యాక్ట్ ప్రకారం శిక్ష తప్పదని ప్రభుత్వ వైద్యులు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు.
🔸అనుమానస్పదంగా ఉండటం తో మాత్రమే వారికీ పరీక్షలు నిర్వహించామని ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తాము ప్రకటిస్తామని, అప్పటివరకు ఎవరు ఎటువంటి ప్రచారాలు చేయొద్దని తెలియజేశారు.
🔸మాస్కులు లేకుండా బయట తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా తప్పదని వారు చెబుతున్నారు.
🔸ఆ రెండు ప్రాంతాల్లో వారి యొక్క రిజల్ట్ సోమవారం రానున్నట్లు తెలుస్తుంది.
🔸అనుమానాస్పదంగా ఉండి పరీక్షలు నిర్వహించిన ప్రతివారికి పాజిటివ్ రాదని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్నవారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని అలా అనేక మందికి పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు.
🔸కావున పరీక్ష రిజల్ట్ రాకుండా ప్రచారాలు చేస్తే శిక్ష తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.