728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 22, 2020

ప్రతిపక్షాలపై దాడుల కోసం కాలమంతా ఖర్చు చేసి కరోనాను నిర్లక్ష్యం చేస్తారా?: చంద్రబాబు

అమరావతి:
★ కరోనా కేసులు ప్రభలుతున్నవి. అయినా స్కాం కోసం ఇళ్ల స్థలాల స్కీంపై శ్రద్ధ పెట్టారు.

★ మంత్రి ఇంటికి పంపిన ఇసుక శాండ్ స్కాంకు నిదర్శనం.

★ తూర్పు గోదావరిలో లేటరైట్, అరకు ఏజెన్సీలో గ్రానైట్ అక్రమ రవాణాలో వైకాపా నేతల హస్తంపై వార్తలొస్తున్నాయి.

★ 108 కుంభకోణం. సీఎం కుటుంబానికి చెందిన ఈడీ అటాచ్ మెంట్ లో ఉన్న సరస్వతి పవర్ కు వేల కోట్ల విలువైన గనులు కేటాయింపు అధికార దుర్వినియోగమని ప్రజలు భావిస్తున్నారు.

★ వీటిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు.

★ చట్టాన్ని, ప్రాధమిక హక్కులు కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని కాలరాస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది.

★ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.

★ ప్రజా సమస్యల పరిష్కారంమే ధేయంగా పని చేస్తున్న నాయకులను టార్గెట్ చేయటం దుర్మార్గం.

★ సర్జరీ చేయింకొని బెడ్ రెస్ట్ లో ఉన్న అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి వందల కి.మీ. ప్రయాణం చేయించి ఇబ్బందులకు గురి చేశారు.

★ తద్వారా మళ్లీ రెండో సారి సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితికి బాధ్యత సీఎంది కాదా?

★ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.

★ గవర్నర్ కు ఫిర్యాదు చేసినా మీలో మార్పు రాదా?

★ 108 కుంభకోణంపై పట్టాభి ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే కుంభకోణం మీద విచారించి చర్యలు తీసుకోకుండా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి బెదిరించే ప్రయత్నం చేశారు.

★ అయ్యన్న పాత్రుడుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చు కున్నారు.

★ యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కూన రవికుమార్,  వాసుపల్లి గణేష్ కుమార్, జేసీ బ్రదర్స్, కలమట మోహన్ రావు, బోండా ఉమా, కేఈ ప్రభాకర్, గల్లా జయదేవ్, పరిటాల శ్రీరామ్.. ఇలా 33 మందిపై అక్రమ కేసులు బనాయించారు.

★ అధికారపక్షం ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానా నిలబడి పోరాడుతుంది.

★ చట్ట వ్యతిరేక, కక్ష పూరిత రాజకీయాలకు స్వస్థి చెప్పకపోతే ప్రజలు తగు సమయంలో తగు బుద్ది చెబుతారు.

★ కరోనా నివారణ చర్యలపై సీఎం దృష్టి పెట్టాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రతిపక్షాలపై దాడుల కోసం కాలమంతా ఖర్చు చేసి కరోనాను నిర్లక్ష్యం చేస్తారా?: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE