న్యూఢిల్లీ:
★ కరోనా చికిత్సకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక సూచనలు జారీ చేసింది.
★ అన్ని రాష్ట్రాల్లో కరోనా రోగుల వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపింది.
★ కరోనా నిర్ధరణ పరీక్షల ధర కూడా దేశమంతా ఒకేలా ఉండేలా చూడాలని కేంద్రానికి స్పష్టం చేసింది.
★ కరోనా రోగుల చికిత్స, మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.
★ సుమోటోగా తీసుకొని ఈ కేసును జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది.
★ కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఆస్పత్రులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
★ ఇందుకోసం ప్రత్యేకంగా నిపుణుల ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
★ దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రి కరోనా వార్డుల్లో భయంకర పరిస్థితులు ఉన్నట్లు తెలిశాక సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
★ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని, రోగులకు మెరుగైన చికిత్స అందుతుందని అభిప్రాయపడింది.
★ కరోనా నిర్ధరణ పరీక్షల ధర కూడా దేశమంతా ఒకేలా ఉండేలా చూడాలని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం.
★ కొన్ని రాష్ట్రాల్లో రూ.2200, మరికొన్ని రాష్ట్రాల్లో రూ.4500గా కరోనా టెస్టుల ధర ఉన్నట్లు గుర్తు చేసింది.
★ కేంద్రమే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
★ ఆస్పత్రులలో కరోనా చికిత్స నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్, గుజరాత్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.
★ ఆస్పత్రులలో వాస్తవ పరిస్థితిని తెలియజేసే వీడియోలను లీక్ చేశారని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేసిన దిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
★ కరోనా పరీక్షల ధరను తగ్గించేందుకు సంబంధిత భాగస్వామ్యపక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం తరఫు వాదనలు వినిపిస్తున్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా కోర్టుకు తెలిపారు.
★ అనంతరం ఈ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.