చిలకలూరిపేట: ప్రభుత్వం నాయిబ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఒక్కో కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయా వర్గాలకు చెందిన వారితో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి రజకులు, నాయిబ్రాహ్మణులు, టైలర్లు, రజకులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు ఎంతో ద్రోహం చేశారని తెలిపారు. నాయిబ్రాహ్మణులను తోక కత్తిరిస్తానని, మత్స్య కారులను తోలు వలుస్తానంటూ గతంలో దూషించిన దుస్సంస్కృతి చంద్రబాబునాయుడిదని మండిపడ్డారు. తమ ముఖ్యమంత్రి బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఒక బీసీ కులానికి చెందిన ఎమ్మెల్యేగా తమ ప్రభుత్వం బీసీలకు ఎంత ప్రత్యేక స్థానం కల్పిస్తున్నదో తనకు తెలుసనని వెల్లడించారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్లో ఎక్కువ శాతం మంది బీసీలే ఉన్నారని, వీరికి ఏడాది కిందటి వర్గాలు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని తెలిపారు. ఇలాంటి వారందరని గుర్తించి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తుండటం హర్షణీయమని కొనియాడారు.
ఐదేళ్లపాటు ఒక్కో కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సాయం..
జగనన్న చేదోడు పథకం కింద వృత్తి పనిచేసే రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. లాక్ డౌన్ వెంటాడుతున్న ఈ సమయంలో రజకులు , నాయిబ్రాహ్మణులు, టైలర్లంతా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో దాదాపు 1500 మంది లబ్ధి పొందారని దాదాపు కోటిన్నర రూపాయల వరకు లబ్ధి కలిగిందని వెల్లడించారు. నిజమైన ప్రజాపాలన అంటే ఇదేనని చెప్పారు.