చిలకలూరిపేట: స్థానిక మార్కెట్ యార్డులో ప్రారంభించనున్న ఇసుక డంపింగ్‌యార్డును బుధవారం ఎమ్మెల్యే విడదల రజిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిలకలూరిపేట ప్రజలు ఇసుక కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే.. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారని చెప్పారు. చిలకలూరిపేటకే డంపింగ్ యార్డును కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఎవరికి ఇసుక కావాలన్నా.. గ్రామాల్లో సచివాలయాల ద్వారానే గురువారం నుంచి బుక్ చేసుకోవాలని సూచించారు. చిలకలూరిపేట డంపింగ్‌యార్డు నుంచి వినియోగదారుల ఇంటికే ఇసుకను చేరవేస్తారని తెలిపారు. ప్రభుత్వం బుధవారమే ఒక జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం వాగుల్లో నుంచి ఇసుకను ఎడ్ల బండ్లపై ఉచితంగా తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఐదు కిలోమీటర్లలోపు ఎడ్ల బండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి ఉచితంగా స్లిప్ తీసుకుని ఇసుకును తీసుకెళ్లొచ్చన్నారు. ఇసుకను ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే ఊరుకోబోమని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఇసుకను అక్రమంగా అమ్మి ఎలా సొమ్ము చేసుకోవచ్చో టీడీపీ నాయకులకు తెలిసినంతగా దేశంలో ఏ నాయకుడికి తెలీదన్నారు. గతంలో వారు చేసి దౌర్జన్యాలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదని చెప్పారు. ఎమ్మెల్యే వెంట మైనింగ్ ఏడీ విష్ణువర్ధనరావు, ఏపీఎండీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
June 10, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఏర్పాటుచేస్తున్న ఇసుక డంపింగ్‌యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

