చిలకలూరిపేట: పట్టణంలోని చీరాల రోడ్ లో గల లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గరలో పట్టణ సిఐ.వి సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఎస్.ఐ షఫీ తన సిబ్బందితో ముందస్తు సమాచారం ప్రకారం సర్వేపల్లి అంకమ్మరావు (50) సంవత్సరాల, శ్రీనగర్ గుంటూరు టౌన్ అతను చిలకలూరిపేటలోని పాటిమీద నివాసం ఉంటూ బైకులు దొంగతనం చేస్తూ బైకులకు నెంబర్ ప్లేట్ లు మార్పు చేసి బైకులు దొంగతనం చేస్తున్న పైవ్యక్తిని పట్టుకుని విచారించారు.
చిలకలూరిపేట పట్టణంలో మూడు బైకులు, గుంటూరు పట్టణంలో ఒక బైకు మరియు మరో రెండు బైకులు ఒక టీవీఎస్ ఎక్సల్ లను అతని వద్ద స్వాధీనపరచుకొని బుధవారం అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
చిలకలూరిపేట పట్టణంలో మూడు బైకులు, గుంటూరు పట్టణంలో ఒక బైకు మరియు మరో రెండు బైకులు ఒక టీవీఎస్ ఎక్సల్ లను అతని వద్ద స్వాధీనపరచుకొని బుధవారం అతనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.