చిలకలూరిపేట: నవతరం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం బుధవారం చిలకలూరిపేటలోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం నిర్వహించారు. సంస్థాగత నిర్మాణానికి సంబంధించి చర్చించారు.రాజకీయ వ్యవహారాల కమిటీ ని వేయాలని,నూతన జిల్లా కమిటీలు,పార్లమెంట్, అసెంబ్లీ కమిటీలు వేయాలని నిర్ణయించారు.
రాయలసీమ ప్రాంతానికి తిరుపతిలో, ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నంలో, కోస్తా ఆంధ్రా ప్రాంతానికి విజయవాడలో పాలనా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సంవత్సరం కాలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలనకు నవతరం పార్టీ నుండి సున్నా మార్కులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రంలో మోడీ సర్కారు ప్రత్యేక హోదా విషయంలో మొండిగా వ్యవహరించడం, కరోనా ప్యాకేజీ డొల్లతనం, దేశవ్యాప్తంగా నియంతృత్వ పోకడలు గురించి చర్చించారు.
కేంద్ర పధకాల అమలు నేతి బీరకాయ వ్యవహారం లాగా ఉందని సమావేశం అభిప్రాయపడింది. ప్రజాసమస్యలపై పోరాడి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా మారేందుకు కృషి చేస్తామన్నారు. నూతన క్రియాశీలక సభ్యులు నమోదు ప్రారంభించారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో, కరోనా వలన మృత్యువాత పడిన వారికి, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నేతలు వి.గణేష్ కుమార్,పోకూరి కవిత,వి సాయి,పి నాని రెడ్డి,చందా శ్రీను,అయ్యంకి సురేష్ బాబు,షేక్ నౌషాద్,పి మణికుమార్, కొక్కల శ్రీనివాస్, ఎం విజయ రాజు,రాగోలు నాగ శివ,రావు రవితేజ, బొడుగు హరీష్ బాబు అన్ని జిల్లాల నేతలు పాల్గొన్నారు.