చిలకలూరిపేట: రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు. స్థానిక ఏడవ వార్డు లో గల వార్డు సచివాలయం నందు సి.ఐ.టి.యు మండల కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వార్డు కార్యదర్శి ఆనంద్ కు వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ప్రభుత్వం వెంటనే 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రతి కుటుంబానికి 7500 రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనిషికి పది కేజీల చొప్పున బియ్యం అలానే కేరళ తరహాలో 14 రకాల నిత్యావసరాలను ఇవ్వాలన్నారు.
లాక్‌డౌన్ కాలంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక మూడు వందల యూనిట్ల లోపు ఉన్నటువంటి కరెంటు బిల్లులను వెంటనే రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా వర్తింప చేయాలని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద స్థానికంగా యాభై రెండు ఎకరాల్లో నిర్మించుకున్న టువంటి ఇళ్ళను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని రద్దయిన వృద్ధాప్య పింఛను వెంటనే అమలు చేయాలని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు లూధర్, సాతులూరి బాబురావు, వీరబాబు, ప్రకాష్ రావు శ్రీనివాస రావు,ప్రభాకర్ రావు,రాజేష్, సాతులూరి పెద్ద రాజా, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.