యడ్లపాడు: కొత్తపాలెం రెవెన్యూ పరిధిలో కొండవీడు కోట, ఘాట్‌రోడ్డు, భవిష్యత్తు అవసరాల కోసం నిర్మించతలపెట్టిన సబ్‌స్టేషన్ కు సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.3.5కోట్ల వ్యవయంతో ఈ సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం కొండవీడు సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే మూడేళ్లలోనే కొండవీడు కోటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న ఈ సబ్‌స్టేషన్ కు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పారు. దీని అవసరం కొండవీడు అభివృద్ధికి ఎంతో ఉందన్నారు. కొండవీడు వచ్చే నాలుగేళ్లలో ప్రపంచస్థాయిలో అభివృద్ధి చెందబోతోందని, భవిష్యత్తులో ఇది గొప్ప పర్యాటక కేంద్రం కాబోతోందని తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ వెలుగులతో కొండవీడు విరజిల్లనుందని, ఈ అవసరాలన్నీ తీరాలంటే, అనుకున్న అభివృద్ధి ముందుకు సాగాలంటే ముందు మౌలిక వసతులు కావాలని, కరెంటు ఉండాలని, విద్యుత్ ఉంటే అభివృద్ధిని వేగవంతంగా చేసుకోవచ్చని వివరించారు. ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్న ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి పనిచేయడం మొదలైతే.. 4.1 కిలోమీటర్ల పొడవునా కొండవీడు ఘాట్ రోడ్డుకు, కోటకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించగలుగుతామని వివరించారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి రాగానే ఈ ప్రాంతంలో వ్యవసాయానికి రోజుకు 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఈ ఉపకేంద్రానికి సుమారు 10 కి.మి. మేర 33 కేవీ లైను, 8.3 కిలోమీటర్ల పొడవున 11 కేవీ విద్యుత్ లైన్లు మంజూరయ్యాయని వివరించారు. వాటిని ఏర్పాటు చేసే సమయంలో ఆయా గ్రామాల ప్రజలు సహకరించలని సూచించారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే పుట్టకోట, కొత్తపాలెం గ్రామాలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందుతుందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో విద్యత్ ఎస్ ఈ ఎ.మురళికృష్ణయాదవ్, ఈఈలు జి.శ్రీనివాసులురెడ్డి , పిచ్చయ్య, కె.రామసుబ్బారావు, ఏడీఈ రాంబొట్లు, ఈఈలు, విద్యుత్‌శాఖ సిబ్బంది, తహశీల్దార్ సుజాత, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు కల్లూరి బుజ్జి, జెడ్పీటీసీ అభ్యర్థి ముక్తా వాసు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
June 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కొండవీడులో సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

