చిలకలూరిపేట: నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి తనకు ముఖ్యమని, నిధుల విషయం తాను చూసుకుంటానని అంచనాలు రూపొందించి ఇవ్వాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని కోరారు. ఆర్అండ్‌బీ ఎస్ఈ మాధవి, ఈఈ, జేఈఈలతో ఎమ్మెల్యే తన కార్యాలయంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలకలూరిపేట- కోటప్పకొండ రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. రవాణా మరింత సులభయ్యేలా ఎక్కడైనా కొత్త రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొండవీడు రోడ్డు పనులు మొదలయ్యాక.. సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. ఆర్ అండ్ బీ విభాగం ఆధ్వర్యంలో గణపవరం, పసుమర్రు గ్రామాల్లో చేపట్టిన ఇళ్ల స్థలాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవచూపాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండేలా పర్యవేక్షించాలని కోరారు.
June 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రోడ్లు, భవనాలు శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

