చిలకలూరిపేట: వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే డ్రైవర్లకు రెండో విడదత ఆర్థిక సాయం అందించిన సందర్భంగా డ్రైవర్లంతా కలిసి స్థానిక మార్కెట్ యార్డులో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందేనన్నారు. దీనివల్ల డ్రైవర్లంతా ఉపాధి కోల్పోయారని తెలిపారు. పస్తులుండాల్సిన దుస్థితి నెలకొన్న విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారని చెప్పారు. అందుకే నాలుగునెలలు ముందుగానే డ్రైవర్లకు ఒక్కొకరికి రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఈ నగదుతో వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతులు లాంటివి చేసుకోవచ్చని చెప్పారు. మామూలుగా అయితే అక్టోబర్, నవంబరు నెలల్లో సాయం చేయాల్సి ఉండగా.. నాలుగైదు నెలలు ముందుగానే సాయం అందించి తమ ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు.
నియోజకవర్గంలో 1200 మందికి లబ్ధి..
ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో 1200 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం అందుతున్నట్లు చెప్పారు. ఈ ఒక్క రోజే రూ.1.2 కోట్ల ఆర్థిక సాయం ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోని డ్రైవర్లకే అందుతోందన్నారు. నియోజకవర్గంలో గతేడాది కంటే ఈ ఏడాది 200 మందికి ఎక్కువగా వాహన మిత్ర లబ్ధి అందుతున్నట్లు చెప్పారు. వాహనమిత్ర ద్వారా రాష్ట్రంలో 2,62,493 మంది లబ్ధి పొందుతుండగా... వీరిలో అత్యధికంగా 1,17,096 మంది బీసీలే ఉండటం తమకు గర్వకారణమని ఆనందం వ్యక్తంచేశారు. ఈ ఏడాది కొత్తగా ఆటోలు కొనుగోలుచేసిన వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేసినట్లు చెప్పారు. గతేడాది కంటే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 37,756 మందికి వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. తమపై నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారని, ఆదరించిన జనం రుణం తాము తీర్చుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
లాక్ డౌన్ సమయంలో ఎమ్మెల్యే రజిని సేవ మరువలేనిది..
ఆటో యూనియన్ ప్రెసిడెంట్ దూళిపాళ్ల సైదులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఎమ్మెల్యే రజిని చేసిన సేవ మరువలేనిది అని,ప్రతి పేదవాడికి కులం,మతం,పార్టీ చూడకుండా ప్రతి గడపకు ఎమ్మెల్యే సేవలు చేరాయంటే అది ఆమె గొప్పతనం.ఇంత మంచిలో కూడా కొంతమంది ఆమె సేవలకు అడ్డుపడ్డారు కానీ మంచి ముందు చెడు ఎప్పుడు నిలువదు అన్నట్లు ఎమ్మెల్యే పనులకు ఎన్ని అడ్డంకులు కలగచేసిన మొక్కవోని దీక్షతో పేదలకు అండగా నిలబడ్డ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.