అమరావతి: కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులకు వేల కోట్ల నిధులు ఇస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప, ఎంత ఇచ్చారో స్పష్టత లేదని విమర్శించారు. అసలు ఇప్పటివరకు కాపు కార్పొరేషన్ కు ఏ బడ్జెట్లో ఎంత కేటాయించారో శ్వేత పత్రంలో వెల్లడించాలని తెలిపారు. ఆకలితో ఏడ్చే పిల్లాడికి చేతిలో గోలీ పెట్టి బుజ్జగించాలని చూశాడట వెనకటికి ఓ ఆసామి! ఏపీలో కాపుల కార్పొరేషన్ కూడా ఆ విధంగా ఏర్పాటైందేనంటూ పవన్ వ్యాఖ్యానించారు.
"వెనుకబడిన జాతికి రిజర్వేషన్లు కోరుతూ చేస్తున్న ఆందోళనల నుంచి కాపుల దృష్టి మరల్చేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కాపుల దృష్టిని ఏమార్చారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరిన్ని తెలివితేటలతో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా, అది కాపులను ఉద్ధరించడానికే అని గొప్పలు పోతోంది.