టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం... ఏపీలో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. రాత్రి పబ్జీ ఆడటం... ఉదయం సైకోయిజం చూపించటం జగన్ రెడ్డి నైజం అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఏడాది పాలనలో విధ్వంసం ఫుల్లు. అభివృద్ధి నిల్లు అంటూ విమర్శలు చేసారు ఆయన.
ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? టిడిపి నాయకులు, కార్యకర్తల ఇంటి ముందు గోడ కట్టడానికా? టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టమనా? టిడిపి కార్యకర్తల ఇళ్ళు కూల్చమనా? టిడిపి కార్యకర్తలను గ్రామాల నుండి బయటకు గెంటేయమనా? ఇందుకేనా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నది? అని నిలదీశారు. దళిత బిడ్డలను దారుణంగా వేధించారన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ పై పిచ్చివాడు అనే ముద్ర వేసి అరెస్ట్ చేసారు. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కచ్చులూరు బోట్ ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టినందుకు మాజీ ఎంపీ హర్ష కుమార్ని అరెస్ట్ చేసారన్నారు. అవినీతికి సహకరించలేదు అని డాక్టర్ అనితా రాణిని వేధించారని ఆరోపణలు చేసారు. దళితుల భూములు బలవంతంగా లాక్కొంటున్నారన్నారు. ఇప్పుడు బీసీ నేతల్ని టార్గెట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయ్యన్నపాత్రుడుది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితమన్న ఆయనలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టిందని మండిపడ్డారు.
జగన్ రెడ్డి పాలనలో పెళ్లికి వెళ్లినా కేసులే అంటూ.. మా పార్టీ సీనియర్ నాయకులు యనమల, చినరాజప్ప వాళ్ళు పెళ్ళికి వెళితే వాళ్ళపై అట్రాసిటీ కేసు పెట్టారని అన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు. వివాదాల జోలికి వెళ్లని వాళ్లపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇక కూన రవి. ఇసుక అక్రమాలు బయట పెట్టినందుకు అయనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయినా ఆయన పోరాటం ఆపలేదు తుగ్లక్ పాలనని ఎండగడుతున్నారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 33 మంది ముఖ్యనాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి అని వైకాపా నేతలు ఆరోపించారు. 6 రూపాయిల అవినీతి అయినా నిరూపించగలిగారా అని నిలదీశారు లోకేష్. ఫైబర్ గ్రిడ్ ఏ శాఖ కిందకి వస్తుందో తెలియని వాళ్ళు నన్ను జైల్లో పెడతానని అనడం కామెడీగా ఉందన్నారు ఆయన.