728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 25, 2020

ఏపీ గవర్నర్‌‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ

అమరావతి:
★ ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.

★ తనకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం టెర్రర్ సృష్టిస్తోందని లేఖలో పేర్కొన్నారు.

★ వెంటనే తమ జోక్యం అవసరమని.. తనను కాపాడాలని రమేష్ కుమార్ కోరారు.

★ హైదరాబాద్ ప్రసన్‌నగర్‌లోని తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారని లేఖలో తెలిపారు.

★ ఒక ఫోర్డ్ కార్, రెండు మోటార్ సైకిళ్లపై తనన్ను అనుసరిస్తున్నారని చెప్పారు.

లేఖలో నిమ్మగడ్డ రాసిన మరిన్ని అంశాలు...
★ నా ఫోన్ ట్యాపింగ్‌లో ఉంది.

★ ఈ ఏడాది మార్చి 18న తనకు రక్షణ కల్పించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నేను లేఖ రాశా.

★ ఈ లేఖపై కూడా అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.

★ ఈ లేఖను నేను రాశానని చెప్పాను.

★ ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కూడా ధ్రువీకరించారు.

★ ఈ లేఖపై స్పందించి నాకు రక్షణ కూడా కల్పించారు.

★ ఏపీ సీఐడీ అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి వెళ్లి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

★ రహాస్య సమాచారాన్ని కూడా తీసుకున్నారు.

★ లేఖను టైప్ చేసిన ఉద్యోగిని కస్టడీలోకి తీసుకున్నారు.

★ ఈ లేఖ బయట తయారు చేస్తున్న ఆరోపణలు సత్యదూరం.

★ నన్ను విజయవాడ, కార్యాలయానికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది.

★ కనీసం తన తల్లిని చూసేందుక్కూడా అవకాశం ఇవ్వడంలేదు.

★ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వాణిమోహన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో నా ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారు.

★ ఏపీ హైకోర్టు నా స్థానాన్ని పునరుద్ధరించాలని తీర్పునిచ్చినా పాత కమిషనర్ కనగరాజ్‌కు ఎన్నికల కమిషనర్ సదుపాయాలు కల్పిస్తున్నారు.

★ ఈ చర్యలన్నీ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి.

★ ఈ దశలో మీ జోక్యం అవసరం. ఎన్నికల కమిషనర్‌గా నన్ను పునరుద్ధరించాలని గవర్నర్‌కు రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ గవర్నర్‌‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE