చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు లో ఈనెల 7వ తేదీన 36 మందికి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఎడ్లపాడు మండల పరిధిలో మొత్తం మీద 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అత్యధికంగా ఎడ్లపాడులోని పై పల్లెలో కేసులు నమోదయ్యాయి.
పూర్తి వివరాలు:
ఎడ్లపాడులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా పైపల్లెలో ఐదుగురు పురుషులకు, ఇద్దరు మహిళలకు మరియు ఎడ్లపాడు బిసి కాలనీలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయా వ్యక్తులకు శనివారం రాత్రి సమాచారం వెళ్ళినట్లు తెలిసింది.
అలాగే ఎడ్లపాడు మండలం సందేపూడి గ్రామానికి చెందిన ఒకే కుటుంబములో భార్య, భర్త ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంమీద ఎడ్లపాడు మండలం లో భారీగా 11 మందికి ఒకేసారి 36 మందికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడం ఎడ్లపాడు మండలంలో కలకలం రేపింది.
ఎడ్లపాడు మండలం లో మూడు నెలల్లో కేవలం ఏడు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, ఏడో తేదీన 36 మందికి నిర్వహించిన పరీక్షల్లో 11 మందికి పాజిటివ్ నమోదు కావడంతో మొత్తం మీద ఈ సంఖ్య ఎడ్లపాడు మండలంలో 18 కి చేరుకుంది.
చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఎడ్లపాడులో 7వ తేదీన నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద 7వ తేదీన నిర్వహించిన పరీక్షల్లో 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పన్నెండు మందిని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల వైద్యాధికారులు చిలకలూరిపేట లోని కోవిడ్ కేర్ సెంటర్ కు చికిత్స నిమిత్తం తరలించనున్నారు.