చిలకలూరిపేట: మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్.. మూడు నెలలు లాక్ డౌన్ లో ఉండి బతకలేని పరిస్థితులు వచ్చాయి. అంతలో మే 25వ తేదీన చినపీర్ సాహెబ్ వీధిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది, కరోనా కేసులు పెరగటంతో అప్పటి నుండి ఇప్పటికీ మా వీధి కంటోన్మెంట్ జోన్లోనే ఉంది. మార్చి నెల 23వ తేదీ నుండి నేటి వరకు మేము ఇళ్లలోంచి కదలడానికి వీలు లేని దుస్థితి. పనులు చేసుకుంటే గాని జీవనం సాగించలేని మేము ఎలా బతకాలో అర్థం కాక అధికారుల్ని, ప్రజాప్రతినిధులను కోరుకుంటున్నాము.
మాకు సాధారణ జీవితం గడపడానికి అనుమతివ్వండి.. లేదా మా కుటుంబాలు గడవటానికి ప్రభుత్వం ద్వారా అయినా సహాయం చేయండి అని ప్రభుత్వ అధికారులను వేడుకున్నారు ఆ వీధి వాసులు. నిబంధనలు అనేక ప్రాంతాల్లో సడలించినా అధికారులు మాత్రం మా వీధికి అలానే నిబంధనలు వర్తింపజేస్తున్నారు.
కావున ప్రజాప్రతినిధులు, అధికారులు దయతో మేము పనులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి.. లేదా మా వీధిలో ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని వినతి పత్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేశారు.