ముంబయి: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల నొప్పితో అమితాబ్ నానావతి ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అమితాబ్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్ కుమారుడికీ కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగతా వారి పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. చికిత్స నిమిత్తం అమితాబ్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. గత పదిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా నుంచి అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్విటర్ చేశారు.
July 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: బిగ్‌బీ అమితాబ్‌కు కరోనా పాజిటివ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE


