చిలకలూరిపేట టౌన్
చిలకలూరిపేట పట్టణం లోని దాసరి బజార్ కళామందిర్ హాల్ వెనుక గల వీధిలో ఒక యువకునికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ యువకుడు కళామందిర్ థియేటర్ మూల మీద ఒక టీ స్టాల్ లో పని చేస్తున్నాడు. గత మూడు రోజుల నుండి టీ స్టాల్ కు రాకుండా నిన్న నర్సారావుపేట లోని ఒక వైద్యశాలలో టెస్ట్ చేయించుకో గా ఆ యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈరోజు నిర్ధారణ అయింది
నాదెండ్ల మండలం సాతులూరులో కరోనాతో వృద్ధుడు మృతి
చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరులో కొవిడ్-19 పాజిటివ్ తో హోటల్ నిర్వహకుడు (70) మృతి చెందాడు.
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఒక హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తి కొద్ది రోజులుగా అనారోగ్యంగా బాధపడుతూ మంగళవారం నర్సారావుపేట లోని ఒక ప్రైవేటు వైద్యశాలలో ఆ వ్యక్తి కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అతనికి కరోనా పాజిటివ్ రావడంతో నిన్న ఉదయం నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు.
అతని మృతదేహాన్ని నరసరావుపేట పురపాలక శ్మశాన వాటికలో నర్సరావుపేట పురపాలక సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు.

