728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 26, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో మరో 20 కరోనా కేసులు... 90కు చేరిన నేటి కేసుల సంఖ్య

చిలకలూరిపేట: పట్టణంలో ఈరోజు భారీగా కరోనా పాజిటివ్ కేసులు 70 వరకు నమోదైన విషయం విదితమే.

నాదెండ్ల మండల రెవిన్యూ కార్యాలయం ఎదురు బజార్ లో ఒక వ్యక్తికి, చందవరం గ్రామంలో ఐదుగురికి, సాతులూరులో నలుగురికి, తూబడులో ఒకరికి, గణపవరంలో ముగ్గురికి మొత్తంమీద నాదెండ్ల మండలంలో ఈరోజు 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో 2, రాజపేటలో 2, వేలూరు గ్రామంలో ఇంకో వ్యక్తికి కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి.  మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట మండల పరిధిలో ఐదుగురికి  కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ రోజు మొత్తం మీద చిలకలూరిపేట పట్టణంలో 70 మందికి, నాదెండ్ల మండలంలో 14 మందికి, చిలకలూరిపేట రూరల్ లో ఐదుగురికి, ఎడ్లపాడు మండలంలో ఒకరికి మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గ పరిధిలో 90 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒకే రోజులో 90 మందికి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో మరో 20 కరోనా కేసులు... 90కు చేరిన నేటి కేసుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE