అయితే ప్రభుత్వ కార్యాలయం ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం తెరిచి తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహించారు. పట్టణంలో అన్ని బజార్లలో అర్బన్ పోలీసులు సి.ఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్సైలు రాంబాబు, షఫీ లు తిరిగి జనం తిరగకుండా చేశారు. నియోజకవర్గం మొత్తం మీద ఇప్పటి వరకు సుమారు 287 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రికార్డు స్థాయిలో వేలూరు గ్రామంలో ఒకే ప్రాంతంలో 18 కేసులు రావడంతో ఆ గ్రామం ఉలిక్కిపడింది. అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతాల్లో హైపో క్లోరయిడ్ సోడియం చల్లి కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేశారు.
